Site icon NTV Telugu

Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్..

Manchu Vishnu

Manchu Vishnu

Manchu Vishnu : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. ఆ మూవీ జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. చాలా మంది కన్నప్ప సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డుకు లేఖలు రాశారు. అలాంటి వారిని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే వారికి చరిత్ర తెలియకపోవచ్చు. మేం చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, ఎంతో మంది అర్చకులకు సినిమా చూపించిన తర్వాతనే ఫైనల్ చేశాం. అందరూ బాగుందన్నారు.

Read Also : Vijay Varma : నాన్నకి భయపడి ఇంటి నుంచి పారిపోయా..!

ఈ సినిమా కోసం చాలా మంది స్టార్లు నటించారు. ప్రభాస్ కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా మంది చిన్న స్థాయిలో ఉన్న వారు కూడా సరిగ్గా పట్టించుకోరు. హెల్ప్ చేయరు. కానీ ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినా కూడా ఎలాంటి యాటిట్యూడ్ చూపించట్లేదు. అడగ్గానే వెంటనే నటించేందుకు ముందుకొచ్చాడు. ఈ రోజుల్లో నా రక్తం పంచుకుని పుట్టిన వారే నా పతనం కోరుకుంటుంటే.. ప్రభాస్ మాత్రం నాకు హెల్ప్ చేశాడు. అందుకే అతనంటే నాకు చాలా రెస్పెక్ట్.

మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కూడా నా కోసం నటించారు. వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. మూవీ కోసం చాలా మంది కష్టపడ్డారు. వారందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మా నాన్న మోహన్ బాబు ముఖంలో సంతోషం చూడటమే నాకు ఇష్టం. ఆయన కోసమే ఈ సినిమాలో చాలా విషయాలను పాటించాను. ఆయన నా సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు’ అంటూ తెలిపాడు మంచు విష్ణు.

Read Also : Single : కేతిక కల నెరవేర్చిన శ్రీ విష్ణు

Exit mobile version