తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా సొంత డబ్బులతో ‘మా’ భవన నిర్మాణం చేపడుతామని మంచు విష్ణు నేడు తన మేనిఫెస్టోను విడుదల సందర్బంగా మాట్లాడారు. సొంతింటి కళతో పాటుగా.. వైద్య సహాయం.. ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. అర్హుల పిల్లలకు కేజీ టూ పిజి ఉచిత విద్య.. సభ్యుల కుటుంబంలో పెళ్లికి కల్యాణ లక్ష్మీ కింద లక్షా 16 వేలు ఇస్తామని మంచు విష్ణు తన మానిఫెస్టోలో తెలియజేశాడు.
Read Also: మా ఎన్నికలు: మంచు విష్ణు మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు
ప్రధాని మోడీతో తనకు బాగా చనువు ఉందని మంచు విష్ణు తెలిపారు. మా అసోసియేషన్ లోని బై లాస్ అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు బయటి వాళ్ళు వస్తున్నారు. వాటిని మారుస్తాం. రవిబాబు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. తెలుగు వాన్నే ఎన్నుకోవాలి. మా భవనానికి వంద కోట్లు అయినా ఖర్చు పెడతాం’ అంటూ మంచు విష్ణు తెలిపారు.