Kannappa : కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు..
- యూపీ సీఎంను కలిసిన టీమ్
- అక్కడే పోస్టర్ రిలీజ్
- విష్ణు ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు తాను నటించిన కన్నప్ప కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 25కు రావాల్సిన మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మంచు మోహన్ బాబు, విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం యోగికి శ్రీరాముడి ప్రతిమ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ ను సీఎం యోగి చేతుల మీదుగా ఆవిష్కరించారు. జూన్ 27న కన్నప్పను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ప్రమోషన్లు పెంచుతామన్నారు. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Read Also : Manchu Manoj: కన్నప్ప సినిమాకు భైరవం పోటీ.. ఇదెప్పుడు జరిగింది?
Also Read
ఓ వైపు మంచు మనోజ్ జల్ పల్లిలోని ఇంటి వద్ద ధర్నా చేస్తున్నాడు. తన వస్తువులు అన్నీ విష్ణు ఎత్తుకెళ్లాడు అంటూ కేసు కూడా పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి విష్ణుపై చాలా ఆరోపణలు చేస్తున్నాడు. అటు మనోజ్ అంత రచ్చ చేస్తున్న టైమ్ లోనే.. ఇటు విష్ణు కన్నప్ప రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, కాజల్ నటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో కన్నప్ప పాత్రలో విష్ణు నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 25కే రావాల్సిన సినిమాను.. వీఎఫ్ ఎక్స్ పనుల వల్ల వాయిదా వేసినట్టు విష్ణు తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!