హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించగా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. అయితే ఈ క్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ ఉండగా ఒక ఫ్యాన్ వచ్చి మంచు మనోజ్ కాళ్ళ మీద పడబోయాడు. వెంటనే అలెర్ట్ అయిన మంచు మనోజ్ వెంటనే అతని కాళ్ళు కూడా పట్టుకుని అప్పుడు సెల్ఫీ ఇచ్చి పంపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మంచు మనోజ్ మాట్లాడుతూ కార్తీక్ అందరి ఆకలి తీర్చేశారు.
విశ్వ గారు పట్టుదలతో ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆయన మా అందరి వెనుక నిలబడ్డారు. నెక్స్ట్ ప్రభాస్ సినిమా రాజా సాబ్ రాబోతుంది. అది వేరే లెవెల్ లో వచ్చింది. గ్యారెంటీగా రికార్డులు తిరిగి రాస్తుంది. మహావీర్ లామా పాత్రకు వచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోలేను. కరెక్ట్ సినిమా తీస్తే ఆడియన్స్ కచ్చితంగా థియేటర్ కి వస్తారు. దానికి రుజువు మిరాయే. ఈ సినిమా పాన్ ఇండియా హౌస్ఫుల్ కి వెళ్తుంది నెక్స్ట్ అన్నయ్య పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వస్తుంది. సెప్టెంబర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మరిచిపోలేని నెల. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే కళకళలాడాలి. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి సినిమా చేయబోతున్నాను. అలాగే టి సిరీస్ వాళ్లతో అబ్రహం లింకన్ అనే సినిమా చేస్తున్నాను. రక్షక అనే సినిమా చేస్తున్నాను. మీ అందరి అభిమానం ఆప్యాయత ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
