NTV Telugu Site icon

Manchu Manoj: తాండూరు ఎమ్మెల్యే అతిరుద్ర మహాయాగంలో మెరిసిన మంచు మనోజ్ దంపతులు

Manchu Manoj With Wife Attends Athirudra Mahayagam At Tandur

Manchu Manoj With Wife Attends Athirudra Mahayagam At Tandur

Manchu Manoj with wife attends athirudra mahayagam at tandur: తాండూరులో అత్యంత వైభవంగా అతిరుద్ర మహాయాగం నిర్వహిస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. కన్నుల పండుగగా కొనసాగుతున్న యాగాన్ని వీక్షించేందుకు భక్తులకు రెండు కళ్లు సరిపోవడం లేదని యాగాన్ని సందర్శించిన వారు అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇంటి వద్ద నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగం సందర్శించేందుకు తాండూరు ప్రాంతంతో పాటు చుట్టుపక్కల జిల్లాల పుణ్య దంపతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు, దేవతామూర్తుల దివ్య మంగళ స్వరూపాలను చూసి మైమరచిపోతున్నారు. ఒక పక్క భజనలు, వేద పండితుల ఆశిర్వచనాలతో మహాయాగం దిగ్విజయంగా కొనసాగుతుంది. తన నివాసం వద్ద లోక కల్యాణార్థం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేపట్టిన శ్రీరాజశ్యామల, శతచండీ, సౌర, లక్ష్మీసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం సందర్శించేందుకు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహుతులు సైతం వస్తున్నారు.

Faria Abdullah: స్త్రీ-పురుషులు ఎప్పటికీ సమానం కాదు..ఫరియా అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

ఇక ఒకేసారి రాజ్యాశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు శక్తివంతమైన అన్ని యాగాలు రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా తాండూరులో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మహాయాగంలో 11 వేల మంది దంపతులు పాల్గొనడాన్ని పీఠాధిపతులు, ప్రవచన కర్తలు, జగద్గురులు అభినందిస్తున్నారని కూడా అంటున్నారు. ఇక యాగం ముగింపు వరకు ఏదో ఒకరోజు సీఎం కేసీఆర్‌ దంపతులు, మంత్రులు, సినీరంగ ప్రముఖులు వస్తారని ముందే పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించగా ఈరోజు మంచు మనోజ్ ఆయన భార్య మంచు మౌనిక మెరిశారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ రాజశ్యామల మహా యాగంలో ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు (ఎమ్మెల్యే ),మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఈ యాగాన్ని సందర్శించారు.

Show comments