NTV Telugu Site icon

Manchu Manoj: మరోసారి మంచు వారింట పెళ్లి భాజాలు.. మోహన్ బాబుకు ఇష్టమేనా..?

Manoj

Manoj

Manchu Manoj: మంచు మోహన్ బాబు ఇంట మోరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయా.. అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. అందుకు కారణం మోహన్ బాబు మూడో కొడుకు మనోజ్ చేసిన ట్వీట్. గత కొంత కాలంగా మనోజ్, దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ జంట కెమెరా కంటికి కూడా కనిపించారు. ఇక ఇపప్టికే మంచు మనోజ్ కు ప్రణీత తో వివాహం కావడం, విడాకులు కూడా తీసుకోవడం జరిగిపోయాయి. ఇక మనోజ్ కు ఇది రెండో పెళ్లి. అయితే ఈ పెళ్లి మంచు కుటుంబానికి ఇష్టం లేదని టాక్. మోహన్ బాబుకు టీడీపీకి పడదు.. అది పక్కన పెడితే.. మనోజ్ తనను కాదని ఈ పెళ్ళికి ఒప్పుకోవడంతో ఆయన చాలా కోపంగా ఉన్నారని సమాచారం.

Allu Arha: ఎవరనుకుంటున్నారు.. పుష్ప రాజ్ బిడ్డ.. ఆ మాత్రం ఉంటుంది

ఇక ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో అప్పటినుంచి మనోజ్, మోహన్ బాబు కుటుంబంతో కలిసి ఉండడం లేదని. మౌనికతో పాటు ఆయన ఒక కొత్త ఇల్లు తీసుకొని ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. గతేడాది చివర్లో మంచు మనోజ్ కడపలో దర్గాను దర్శించుకున్నప్పుడు త్వరలోనే మంచి శుభవార్తను చెప్తానని చెప్పుకొచ్చాడు. ఇక నిన్నటికి నిన్న.. జనవరి 20 న అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు ట్వీట్ చేశాడు. అసలు గుడ్ న్యూస్ దేని గురించి.. పెళ్లి గురించా..? లేక సినిమా గురించా..? అనేది క్లారిటీ ఇవ్వు భయ్యా అని అభిమానులు కామెంట్స్ పెట్టగా.. “ముహూర్తం రేపు ఉదయం 9.45.. మీతో పంచుకోవడం కోసం ఎదురుచూడలేకపోతున్నాను” అంటూ మరోసారి ట్వీట్ చేశాడు. దీంతో మనోజ్ చెప్పబోయే ఆ న్యూస్ కచ్చితంగా పెళ్లి గురించే అని ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టమా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది. మరి మనోజ్ ఎలాంటి న్యూస్ చెప్పనున్నాడో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.