Site icon NTV Telugu

Mirai : మిరాయ్ లో అదే హైలెట్ సీన్ : మంచు మనోజ్

Mirai Manoj

Mirai Manoj

Mirai : యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్ గా వస్తున్న మూవీ మిరాయ్. సెప్టెంబర్ 12న మూవీ రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మనోజ్ తాజాగా ఎన్టీవీతో స్పెషల్ గా మాట్లాడారు. మిరాయ్ నా కెరీర్ లోనే మంచి క్రేజ్ ఉన్న సినిమా. మూడేళ్ల క్రితం ఈ సినిమాను ఒప్పుకున్నాను. దీన్ని ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ తేజ సజ్జా. అతని సినిమాలు చూసి ఓ సారి నేనే చెప్పాను. తమ్ముడు మంచి స్క్రిప్ట్ ఉంటే తీసుకురా.. మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం అన్నాను. దాంతో అతను నా దగ్గరకు ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. ఇందులో బ్లాక్ స్క్వార్డ్ పాత్రకు నువ్వు మాత్రమే సెట్ అవుతావని నన్ను ఒప్పించాడు. అతని కోసమే ఈ సినిమా చేశాను.

Read Also : Mirai : మిరాయ్ గురించి సీక్రెట్ చెప్పిన మంచు మనోజ్..

నా బర్త్ డే సందర్భంగా వచ్చిన నా పాత్ర గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్ లో అంతటి క్రేజ్ వచ్చింది ఈ సినిమాకే. ఇందులో చాలా సీన్లు అదిరిపోతాయి. ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. ఆ సీక్వెన్స్ ను దాదాపు పదిహేను రోజుల దాకా షూట్ చేశాం. ఆ మూవీ కోసం చాలా కష్టపడ్డాం. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడితే కంప్లీట్ అయింది. ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్ముతున్నాను. ఈ సినిమా తర్వాత ఇలాంటి పాత్రలు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ ఈ మూవీలో పాత్ర నాకు బాగా నచ్చింది కాబట్టే చేశాను అంటూ తెలిపాడు మనోజ్. మిరాయ్ ట్రైలర్ తోనే భారీ అంచనాలు పెంచేసింది. ఇతిహాసాలను బేస్ చేసుకుని వస్తుండటంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.

Read Also : Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అప్పుడేనట..

Exit mobile version