NTV Telugu Site icon

Manchu Manoj: ‘ఉప్పెన’ సినిమాలోలా దేశాలు పారిపోయాం.. నేను బ్రతికి కూడా వేస్ట్ అనుకున్నా

Mounika

Mounika

Manchu Manoj: మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మంచు మనోజ్ లవ్ స్టోరీ.. ఆయన రెండో పెళ్లి అయితే ఒక సినిమా కూడా తీయొచ్చు. అన్ని ట్విస్టులు ఉంటాయి అతని జీవితంలో. మౌనిక రెడ్డిని ప్రేమించి, ఇంట్లోవారు ఒప్పుకోకపోయినా పోరాడి.. చివరికి ప్రేమించిన మౌనికనే వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్ళికి ముందు వీరిద్దరూ చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ బయటికి తెలియకపోయినా సినిమా స్టైల్లో తాము చాలా రిస్క్ లు చేశామని ఈ జంట చెప్పుకొచ్చారు. పెళ్లి తరువాత ఈ జంట మొదటి సారి ఒక టాక్ షోలో సందడి చేశారు. వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న ఆ షోలో మనోజ్, మౌనిక తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. వెన్నెల కిషోర్, మంచు మనోజ్ బెస్ట్ పఫ్రెండ్స్ అన్న విషయం తెల్సిందే. దీంతో మనోజ్ ముందు జీవితం గురించి కాకుండా వారి లవ్ స్టోరీ గురించి అడిగి ఆసక్తి పెంచాడు. వారిద్దరి మధ్య పరిచయం, ప్రేమ, పడిన ఇబ్బందులు అన్ని వివరంగా అడిగి అభిమానులకు తెలిసేలా చేశాడు.

Akira Nandan: పవన్ వారసుడు ఎంట్రీ ఇలానా.. ఇదెక్కడి ట్విస్ట్ రేణు

ఇక మనోజ్ తనదైన రీతిలో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చాడు. మౌనిక చాలా అమాయకురాలిలా కనిపిస్తుంది కానీ, కోపం ఎక్కువ అని తెలిపిన మనోజ్.. ఆ కోపానికి తాను బలి అవుతున్నాను అని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇక ఇద్దరిలో తానే రొమాంటిక్ అని, ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అంటూ ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడుకున్నట్లు తెలిపాడు. ఆ తరువాత మేము వనవాసం చేసాం.. ఉప్పెన సినిమాలో ఈశ్వర సాంగ్ లో ఎలా అయితే వారు ఊర్లు పట్టుకొని తిరిగారో.. మేము దేశాలు పట్టుకొని తిరిగాం. ఆ సినిమాలో ఈశ్వరా సాంగ్ 5 నిమిషాలే.. మాకు సంవత్సరాలు ఉంది. ఇక మనోజ్ గురించి మౌనిక చెప్తూ.. ” అమ్మ చనిపోయాక.. ఆకాశం చూస్తూ నువ్వెక్కడ ఉన్నా నాకు ఏం కావాలో నీకు తెలుసు.. అంతా నీకే వదిలేస్తున్నా అని చెప్పా.. ఆ సమయంలో మనోజ్ ఆళ్లగడ్డ వచ్చాడు. దాన్ని ఎప్పటికి మర్చిపోలేను” అని కంటనీరు పెట్టుకుంది. ఇక పెళ్లి సమయంలో తాము చాలా స్ట్రగుల్ అయినట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. “ఎటుపక్క నిలబడుతున్నాను.. ఏంటి అనే విషయం తెలియలేదు.. సరే నువ్వు ఒక్కటి సెలెక్ట్ చేసుకో.. లవ్ లైఫా.. సినిమా కెరియరా అనే పరిస్థితి ఎదురయ్యింది. మనల్ని నమ్ముకొని ఒక అమ్మాయి బిడ్డతో లైఫ్ లో నిలబడి ఉంది నా కోసం.. నేను బ్రతికి కూడా వేస్ట్ ఈ జన్మకు.. ఎన్ని డోర్స్ మూస్తారు.. మూయండి” అంటూ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments