Site icon NTV Telugu

Manchu Lakshmi: ఏది.. ఈ విషయంలో మంచు లక్ష్మీని ట్రోల్ చేయండి.. చూద్దాం

Lakshmi

Lakshmi

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు గురించి కానీ, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి గానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబాన్ని మొత్తం సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తువుగా వాడుకుంటారు. వాళ్ళు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా ట్రోల్స్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ ఇంగ్లీష్ గురించి, డ్రెస్సింగ్ స్టైల్ గురించి ట్రోల్ చేయడం తెల్సిందే. అయితే ఇవేమీ పట్టించుకోని మంచు కుటుంబం తమ పనుల్లో తమ బిజీగా ఉంది. ఇక మంచు లక్ష్మీ గురించి చెప్పాలంటే ప్రస్తుతం ఆమె నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. ఇంకొపక్క తల్లిగా కూతురుతో నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మంచు లక్ష్మీ చేసిన ఒక పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా అభిమానుల ప్రశంసలను అందుకుంటుంది. అదేంటంటే.. మంచు లక్ష్మీ గతేడాది నుంచి టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గత ఏడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలను ఆమె దత్తత తీసుకుంది.

Nikhil: ప్లాప్ ఎఫెక్ట్.. ఆ కండీషన్లు పెట్టిన నిఖిల్.. ?

సరైన చదువు లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్న విద్యార్థులు కానీ, లేక చదువుకోవాలని ఉన్న చదవలేని విద్యార్థులను, మంచి సదుపాయాలు లేని స్కూల్స్ ను దత్తత తీసుకొని దగ్గరుండి ఆ స్కూల్స్ ను బాగుచేయించడం, విద్యార్థుల అవసరాలను తీర్చడం లాంటివి టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో చేస్తారు. ఇందులో సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలలను మంచు లక్ష్మీ దత్తత తీసుకుంది. ఇక దత్తత తీసుకున్న పాఠశాలలకు వెళ్లి ఆమె వారికి ఏఏ అవసరాలు ఉన్నాయో అని తెలుసుకుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అక్క చేసిన పనికి తమ్ముడు మంచు మనోజ్ గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. మంచు లక్ష్మీ ఫోటోలు షేర్ చేస్తూ.. “మా అక్కని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో ని 30 పాఠశాలలను దత్తత తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయంలో మా అక్కకు సహకరించిన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన మంచక్క అభిమానులు ఏది ఇప్పుడు.. ట్రోల్ చేయండి మా మంచు లక్ష్మీని.. ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించరు గాని ట్రోల్ చేయడానికి అయితే ముందుంటారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది చాలా మంచి పని చేశారు.. ఇలాగే మంచి పనులు చేయండి.. అంటూ మంచు లక్ష్మీని ప్రశంసిస్తున్నారు.

Exit mobile version