మంచు ఫ్యామిలి అన్నదమ్ముల వ్యవహారం నిరంతర ధారా వాహికలా సాగుతూనే ఉంది. తాను ఇంట్లో లేని సమయంలో కారు తో పాటు మరికొన్ని వస్తువులను విష్ణు అతడి అనుచరులు దొంగతనం చేసాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. నేడు కుటుంబంతో కలిసి జల్ పల్లిలోని నివాసానికి వెళ్లిన మంచు మనోజ్ కు పరాభవం ఎదురైంది.
Also Read : NTRNeel : ‘యంగ్ టైగర్’ఎన్టీఆర్ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?
ఇంట్లోకి ఎవరికి అనుమతి లేదని మంచు మనోజ్ కుటుంభ సభ్యులను లోనికి రాకుండా ఆపేసారు అధికారులు. దింతో ఇంటి బయట ఆందోళనకు దిగిన మంచు మనోజ్ మాట్లాడుతూ ‘ అసలు నాకు మా నాన్నకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. కావాలనే పిచ్చోళ్ళని చేస్తున్నారు. నా కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న జల్ పల్లి వచ్చాము. కానీ ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్ కు వెళ్ళాము. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి. ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని అడుగుతున్నా. ఏరోజు నేను ఆస్తి కోసం కొట్లాట చేయలేదు. నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా. నేనంటే విష్ణుకి కుల్లు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్ళ నివ్వడం లేదు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారు. విష్ణు కెరియర్ కోసం నేను ఆడవేషం కూడా వేశాను. నేను గ్రాఫిక్స్ నేర్చుకుంటే విష్ణు గ్రాఫిక్స్ స్టూడియో పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈ కేసులో ఎందుకు చార్జి షీటు దాఖలు చేయలేదో పోలీసులు చెప్పాలి. ప్రస్తుతం ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి లోపలికి వెళ్తామంటే పోలీసులు వెళ్లనివ్వట్లేదు’ అని అన్నారు.