Manchu Manoj: మంచు మనోజ్ టీమ్‌లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్‌లో అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ టీమ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సినిమాకు పనిచేస్తున్న ఓ క్రూ మెంబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మంచు మనోజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా.. న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ‘డేవిడ్ రెడ్డి’ చిత్రానికి DOP విభాగంలో లక్ష్మణ్ రావు అనే టెక్నీషియన్ పనిచేస్తున్నారు. అయితే, ఆయన హఠాత్తుగా అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ వార్త విన్న వెంటనే మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. తన టీమ్ మెంబర్‌ను కోల్పోవడం పట్ల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మణ్ రావుది సాధారణ మరణం కాదని, దీని వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మంచు మనోజ్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. “లక్ష్మణ్ రావు మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అనుమానాస్పద మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెంటనే బయటకు రావాలి. ఈ ఘటనపై ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి” అని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని కోరుతూ.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల డీజీపీలను (DGPs) మనోజ్ తన ట్వీట్లో ట్యాగ్ చేశారు. “ఈ మరణం వెనుక ఎవరున్నా.. నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకూడదు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. ఏ నేరమూ శిక్ష పడకుండా, చట్టం కళ్లుగప్పి తప్పించుకోకూడదు” అని పోలీసులను కోరారు. మనోజ్ చేసిన ఈ సంచలన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
Shocked and deeply saddened by the tragic loss of our Lakshman Rao anna, a sincere and hardworking member of our film #DavidReddy team. Such a sweet and happy soul.
His passing under such mysterious circumstances is truly heartbreaking.
My heartfelt condolences to his family.
I… pic.twitter.com/wQ6PMIDEgw— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 16, 2026
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!