Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం ఉస్తాద్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్మిస్తుండగా.. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ ఒక్కొక్కరిగా ఈ షోకు రావడం, వారిని మనోజ్ ఆడుకోవడం చూస్తూనే ఉన్నాం. హోస్ట్ గా మనోజ్ ఉండడంతో చాలావరకు అతని స్నేహితులే ఈ షో గెస్టులుగా మారారు. గత ఎపిసోడ్ లో రానా సందడి చేయగా ఇక ఈ ఎపిసోడ్ కు మాస్ మహారాజా రంగంలోకి దిగాడు. ఈగల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ ఉస్తాద్ షోలో సందడి చేశాడు. రవితేజ ఎక్కడ ఉంటే ఎనర్జీ అక్కడ ఉంది అన్నట్టు మాస్ మహారాజా కనిపించడంతోనే రచ్చ మొదలైపోయింది. ఇక రవితేజ పంచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రావడం రావడమే అభిమానులతో తనదైన పంచులు వేసి మెప్పించాడు. ఒక లేడీ అభిమాని రవితేజ అంటే ఇష్టమని, తనకు పెద్ద ఫ్యాన్ అని ఇంగ్లీషులో చెప్పగా.. తెలుగు రాదా నీకు అంటూ పంచువేసి అందరిని నవ్వించాడు.
ఇక అభిమానులను అంతగా నవ్వించిన రవితేజను మనోజ్ తన ప్రశ్నలతో ఒక ఆట ఆడేసుకున్నాడు. ఇండస్ట్రీలో నువ్వు వాడినని బీప్ లు ఎవరు వాడి ఉండరు అంట కదా అన్నయ్య అని అడగగా రవితేజ వాళ్ళందరూ మాట్లాడతారు కానీ నేను బయటికి మాట్లాడేస్తాను అదే తేడా అని చెప్పుకొచ్చాడు. ఇక ఆటలో రవితేజ చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు. అయితే 25 లక్షలకు గాను కొన్ని ఆన్సర్ చేయకపోవడంతో రెండు లక్షలకి ఆట ముగిసిందని మనోజ్ చెప్పగానే రవితేజ పోనిలే దీనమ్మ గోల అని చెప్పడం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఫిబ్రవరి 1 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఫిబ్రవరి 9న ఈగల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మాస్ మహారాజా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి
