NTV Telugu Site icon

Manchu Lakshmi: అర్ధరాత్రి నడిరోడ్డుపై పోలీస్ అఘాయిత్యం.. రక్తం మరిగిపోతుందన్న మంచక్క

Manchu

Manchu

Manchu Lakshmi: ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ లేదు అన్నది నమ్మదగ్గ నిజం. అమ్మ కడుపులో తప్ప బయట ఎక్కడా అమ్మాయిలకు రక్షణ లేదు. ఇక ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటామని ప్రమాణం చేసిన పోలీసులే.. మహిళలను హింసిస్తున్నారు. తాము ఉన్నాం అని దైర్యం చెప్పాల్సింది పోయి.. తాము కూడా మగవారిమే అని కామాంధులుగా తయారవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక పోలీస్.. అర్ధరాత్రి, ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది ఏ ప్లేస్ ఏంటి అనేది తెలియదు కానీ.. బైక్ మీద కూర్చున్న పోలీస్.. ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ కనిపించాడు. ఆమె శరీరాన్ని ఆమె అనుమతి లేకుండా తాకుతూ ఆనందపడుతున్నాడు. ఈ ఘటనను కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వీడియోను షేర్ చేస్తూ తన ఆగ్రహాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో చూశాక నా రక్తం మరిగిపోతోంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ ట్వీట్ ను నెట్టింట వైరల్ గా మారింది. మంచు లక్ష్మీ చేసినా ఏ ట్వీట్ కైనా విమర్శలు వాస్తు ఉండడం కామన్. కానీ ఈ వీడియోపై నెటిజన్లు సైతం మంచు లక్ష్మీ కి సపోర్ట్ చేస్తున్నారు. ఆ పోలీస్ ఎవరో కనుక్కొని అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మంచు లక్ష్మీ అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది. ఈచిత్రంలో ఆమె పోలీసాఫీసర్ గా నటిస్తుండడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మంచక్క ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments