NTV Telugu Site icon

Manchu Lakshmi: బొడ్డు చూపిస్తూ మంచు లక్ష్మీ డ్యాన్స్.. కూతురు ఎంట్రీతో

Manchu

Manchu

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు పెద్ద కూతరు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ తన ఇంట్లో జరిగే శుభకార్యాల దగ్గర నుంచి తన కూతురు స్కూల్ కు వెళ్లి వచ్చే వీడియోల వరకు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకోపక్క కొత్త సినిమాల ఆల్ ది బెస్ట్ చెప్తూ.. కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలానే దసరా సినిమా రేపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ.. దసరా సినిమాలోని చమ్కీల అంగీయేసి చాకు లెక్క ఉండేటోడే సాంగ్ కు స్టెప్పులేసింది. పింక్ కలర్ చీరలో మంచక్క అద్భుతంగా స్టెప్స్ వేసింది. ముఖ్యంగా ఆమె బొడ్డు.. దానికి ఉన్న రింగ్ అయితే అద్భుతమని చెప్పాలి. మొదటి నుంచి కూడా లక్ష్మీ ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ఉంటుంది.

Pavani Reddy: ప్రెగ్నెంట్ అయ్యా.. అందుకే సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నా.. ఇంకా..?

మోడ్రన్ అయినా ట్రెడిషనల్ అయినా.. తనకు నప్పేవి తీసుకుంటూ ఉంటుంది. ఇక ఈ రీల్ చివరిలో లక్ష్మీ కూతురు ఎంట్రీ అదిరిపోయింది. తన తల్లి ఇలా ఉంటుంది అన్నట్లు.. నోరు విడిచి అడగదురా.. చెప్పింది చేయదు రా.. పక్కింట్లో కూర్చొని చాడీలు చెప్తుంది అంటూ చెప్పుకు రావడంతో ఆశ్చర్యపోయిన లక్ష్మీ.. తన కూతురు నోరుపై చెయ్యి అడ్డుపెట్టి లాకెళ్లి పోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ అక్కా.. అని కొందరు.. మీ బొడ్డు మీద రింగ్ బావుంది అని ఇంకొందరు.. తల్లీ కూతుళ్లు సో క్యూట్ అంటూ చెప్పుకొస్తున్నారు.

Show comments