NTR: ఇకపై యంగ్ టైగర్ కాదు… మ్యాన్ ఆఫ్ మాసెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా దగ్గర ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్స్ ఉన్నారు… కానీ యంగ్ టైగర్ బిరుదున్న ఏకైక హీరో మాత్రం ఎన్టీఆర్ మాత్రమే. కోరమీసంతో టీనేజ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించిన ఎన్టీఆర్‌ను యమదొంగ నుంచి యంగ్ టైగర్‌గా మార్చేసింది టాలీవుడ్. అప్పటి నుంచి ప్రతి సినిమాలో యంగ్ టైగర్‌గానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది కానీ ఎన్టీఆర్‌కున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే… మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు కూడా ఎన్టీఆర్‌కే ఉంది. ఇక ఇప్పుడు దేవర సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్‌గానే కంటిన్యూ కానున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ దేవర గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన దేవర గ్లింప్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
కొరటాల మార్క్‌తో పక్కా మాస్ మూవీగా వస్తున్న దేవర గ్లింప్స్ అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. అయితే… ఈ గ్లింప్స్‌లో నోటీస్ చేయాల్సింది ఒకటి ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తన స్టార్ ట్యాగ్‌ని మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మార్చుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బదులుగా గ్లింప్స్‌లో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్’ అనే ట్యాగ్ ఇచ్చారు. దీంతో దేవర నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌గా కాదు… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌గా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాడు తారక్. ఇకపోతే… రెండు భాగాలుగా రానున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాతో కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవనున్నాడని.. దేవర గ్లింప్స్‌తో చెప్పేశాడు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!