Site icon NTV Telugu

‘ఏజెంట్’తో మమ్ముట్టి!?

Mammootty

ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ లో పరభాషా తారలకు డిమాండ్ బాగా ఉంది. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో తొలి హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కూడా అలా ఓ స్టార్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఈ ఏడాది జనవరిలో ఆరంభమైన అఖిల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం కానున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషించబోతున్నారట. త్వరలో హంగేరీలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో ఆయన అఖిల్ తో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.

Read Also : “మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్

అందులో భాగంగా మమ్ముట్టి 10 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటారట. అఖిల్ ‘ఏజెంట్’కి మమ్ముట్టి కలయిక అదనపు ఆకర్షణ అవుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో మమ్ముట్టి ‘యాత్ర’ సినిమాతో తెలువారిని ఆకట్టుకున్నారు. అంతకు ముందు కూడా ‘స్వాతి కిరణం, సూర్యపుత్రులు’ సినిమాలలో నటించి మురిపించారు. ‘ఏజెంట్’కి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇది 2022లో విడుదల అవుతుంది.

Exit mobile version