Site icon NTV Telugu

Mamitha Baiju: ఒక్క అక్షరం ఆ హీరోయిన్ జీవితాన్నే మార్చేసింది!

Mamitha Baiju

Mamitha Baiju

Mamitha Baiju Reveals intresting story Behind her Name: తెలుగు సినిమాల్లోకి మలయాళం నుంచి హీరోయిన్లను తీసుకురావడం చాలా కాలం నుంచి జరుగుతున్న తంతే. మన తెలుగమ్మాయిలని తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్లుగా నటింప చేస్తుంటే మనవాళ్లు అక్కడ సూపర్ హిట్ లు కొడుతున్న వాళ్లని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మమిత బైజు అనే కేరళ కుట్టి బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆమె హీరోయిన్గా నటించిన ప్రేమలు అనే సినిమా ఇక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. నిజానికి మలయాళంలో సూపర్ హిట్ అవడంతో దాన్ని తెలుగులోకి రాజమౌళి కుమారుడు కార్తికేయ తీసుకొచ్చాడు. ఇక అటు మలయాళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా హీరోయిన్ మమితకి వరుస సినీ అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Maruthi : నన్ను టార్చర్ పెట్టాడు.. కొరడాలతో కొడుతుంటాడు.. డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే ఆమె తన పేరు గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. అదేంటంటే మమిత అనేది తన అసలు పేరు కాదని, తన పేరు మారడం వెనుక పెద్ద కథే ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది. తన అసలు పేరు నమిత అట, పుట్టినప్పుడు హాస్పిటల్‌ సిబ్బంది బర్త్‌ సర్టిఫికెట్‌లో పొరపాటున ‘N’ అనే అక్షరానికి బదులు ‘M’ అనే అక్షరాన్ని రాశారని ఆ దెబ్బతో నమిత అవ్వాల్సిన తాను మమిత అయ్యానని చెప్పుకొచ్చింది. అయితే బర్త్‌ సర్ట్‌ఫికెట్‌ ఇష్యూ అయిన టైమ్‌లో మా పేరెంట్స్‌ చూసుకోలేదు, సరిగ్గా స్కూల్‌లో జాయిన్‌ అవ్వాల్సిన సమయంలో ఈ విషయాన్ని గుర్తించారు. అయితే ముందు మార్చాలి అని అనుకున్న సరే ఇది కూడా ఏదో తేడా గానే ఉన్న కాస్త ఎంతగా ఉంది కదా అని భావించి ఉంచేసారట. అలా ఉంచడానికి కారణం ఆ పేరుకి మలయాళంలో మిఠాయి అని అర్థం వస్తుంది. సరే అని అలాగే ఉంచేయడంతో నమిత కావాల్సిన తాను మమితనయ్యానని ఆమె కామెంట్ చేసింది.

Exit mobile version