NTV Telugu Site icon

Mamatha Mohan Das: ఎన్టీఆర్ హీరోయిన్ ను అవమానించిన నయన్.. మరీ ఇంతలానా

Nayan

Nayan

Mamatha Mohan Das: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఘనత ఆమెకు ఉంది. ఇక హీరోయిన్ గా ఉన్న దశలోనే ఆమెకు చాలా పొగరు అని ఇండస్ట్రీలో టాక్. మిగతా హీరోయిన్లతో సరిగా ఉండేది కాదని, ఆమె ఉన్న సినిమాలో ఇంకో హీరోయిన్ ఉంటే ఒప్పుకునేది కాదని కోలీవుడ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా నయన్ అలానే చేసిందన మరో హీరోయిన్ చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మమతా మోహన్ దాస్. హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో కూడా మంచి అవకాశాలను అందుకుంది. ఇక ఈ మధ్యనే క్యాన్సర్ తో పోరాడి గెలిచిన మమతా ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చింది.

Tammareddy Bharadwaj: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేలా.. మాస్టారూ

” నేను ఒక సినిమాలో సాంగ్ చేయడానికి ఒప్పుకున్నాను. పెద్ద హీరో.. మంచి పారితోషికం అన్నారు. సరే అని నేను ఇచ్చిన డేట్స్ లో సెట్ కు వెళ్లాను. నాలుగు రోజులు సెట్ కు వెళ్లడం, కూర్చోవడం జరిగింది. అయితే తరువాత నాకు అర్థమైంది నన్ను వారు క్యాప్చర్ చేయడం లేదని, నాతో షూటింగ్ చేయడం లేదని.. ఇక తరువాత ఆరా తీస్తే అందులో నటిస్తున్న హీరోయిన్.. తాను వేరొక హీరోయిన్ తో నటించడం ఇష్టం లేదని చెప్పిందట. అందుకే వారు నాకు చెప్పకుండా నన్ను పక్కన కూర్చోపెట్టారు. ఆ విషయం తెలిసేసరికి నేను చాలా బాధపడ్డాను. అలా ఆమె వల్ల తన నాలుగు రోజులు టైం వేస్ట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అయితేఆ కథానాయిక ఎవరో కాదు నయనతారనే … ఆ సినిమా రజినీకాంత్, జగపతి బాబు నటించిన కథానాయకుడు. ఆ సినిమాలో నయన్, రజిని పై జరిగే సాంగ్ లో మమతా ఒక చిన్న షాట్ లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సినిమా కోసం తన రెమ్యూనిరేషన్ తనకు వచ్చి ఉండొచ్చు కానీ, అలా నయన్ మాట్లాడి తనను అవమానించింది అనే బాధ మాత్రం లోపల ఇంకా ఉందని మమత చెప్పే విధానంలోనే తెలిసిపోయింది అంటున్నారు అభిమానులు.