‘యమదొంగ, చింతకాయల రవి, కింగ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘లాల్ బాగ్’. ఐటీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ మురళి పద్మానాభన్ దర్శకుడు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా దీన్ని నిర్మిస్తున్నారు. నందిని రాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ మూవీని ఇదే నెల 26న రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత రాజ్ తెలిపారు.
‘లాల్ బాగ్’లో మమతా మోహన్ దాస్ కు ఏం పని!?

mamatha mohan das