Site icon NTV Telugu

Mallidi Vasishta: బింబిసార డైరెక్టర్‌కి బంపరాఫర్.. ఆ స్టార్‌తో సినిమా?

Mallidi Vasishta Balayya Fi

Mallidi Vasishta Balayya Fi

Mallidi Vasishta Gets Huge Offer To Direct A Star Hero: ఇప్పుడు టాలీవుడ్‌లో ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట్ పేరు మార్మోగిపోతోంది. తొలి ప్రయత్నంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం, టైమ్ ట్రావెల్ + చారిత్రాత్మక సబ్జెక్ట్‌ని బాగా హ్యాండిల్ చేయడంతో.. సర్వత్రా అతనికి ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. అంతేకాదు.. ఆఫర్లు కూడా కుండపోతగా వచ్చి పడుతున్నాయని ఇన్‌సైడ్ న్యూ్స్! తొలి ప్రయత్నంలోనే వండర్స్ క్రియేట్ చేయడంతో.. ఈ దర్శకుడితో కలిసి పని చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే బంపరాఫర్ వశిష్ట్‌కు వచ్చిందట! ఈ క్రేజీ కాంబోని గీతా ఆర్ట్స్ బ్యానర్ సెట్ చేయబోతోందని టాక్! బాలయ్యతో అన్‌స్టాపబుల్ కార్యక్రమం చేసిన నిర్మాత అల్లు అరవింద్.. అదే సమయంలో బాలయ్యతో ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నారు. సరైన దర్శకుడు దొరికినప్పుడు, ఆ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లేలా మాట్లాడుకున్నారు కూడా! ఇప్పుడు వశిష్ట్ ప్రతిభను చూసి ఫిదా అయిన అల్లు అరవింద్.. బాలయ్య సినిమా కోసం అతడ్ని రంగంలోకి దింపనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి, ఇది నిజమో, కాదో ఇంకా తేలాల్సి ఉంది.

మరోవైపు.. బాలయ్య తన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మాస్ ఎంటర్టైనర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడితోనూ బాలయ్య జోడీ కట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లేందుకు ముస్తాబవుతోంది. అటు.. ‘బింబిసార’ ఘనవిజయం సాధించడంతో, దాని ‘పార్ట్-2’ పనుల్లో వశిష్ట్ – కళ్యాణ్ రామ్ నిమగ్నమైనట్టు సమాచారం.

Exit mobile version