NTV Telugu Site icon

Ananya Nagalla: అనన్య నాగళ్ళకి క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్న.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Ananya Nagalla

Ananya Nagalla

Mallesham Excecutive Producer Comments on Ananya Nagalla Casting Couch: అనన్య నాగళ్ల పొట్టేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాస్టింగ్‌ కౌచ్‌పై ఎదురైన ప్రశ్నకు నటి అనన్య నాగళ్ల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు తెలుసుకోకుండా వంద శాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారు? అని, క్యాస్టింగ్ కౌచ్ ఏమీ లేదని ఆమె అన్నారు. అయితే మీరు చేసే అగ్రిమెంట్ లో కూడా ఉంటుందట కదా, మా ఫ్రెండ్సే చెప్పారు అని అంటే ఈ వంద శాతం తప్పు అని అన్నారు. అవకాశం రావడం కంటే ముందే కమిట్‌మెంట్‌ అనేది టాలీవుడ్‌లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్‌ అనేది సమానంగా ఉంటాయి. మీరు ఎక్స్ పీరియన్స్ చేయకుండా ఎలా అడుగుతున్నారు? నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్‌ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు’ అని అన్నారు.‘‘కమిట్‌మెంట్‌ను బట్టే పారితోషికం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది’’ అని సదరు విలేకరి మరో ప్రశ్న సంధించగా.. ‘మీరు విన్న మాటలు చెబుతున్నారు. కానీ, నేను ఆ ఫీల్డ్‌లోనే ఉన్నా. మీరు అనుకున్నది ఇక్కడ లేదు’’ అని ఆమె బదులిచ్చారు.

Bomb Threats: అసలేం జరుగుతోంది.. 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపులు..

ఇక ఈ విషయం మీద అనన్య మొదటి సినిమా మల్లేశం ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా వ్యవహరించిన వెంకట్ సిద్దారెడ్డి స్పందించారు. అనన్య మొదటి సినిమా మల్లేశం సినిమా చాలా వరకూ పోచంపల్లిలో జరిగింది. పోచంపల్లిలో ఉండడానికి హోటల్స్/లాడ్జ్ ఉండవు కాబట్టి అక్కడ కొన్ని ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాం. అనన్య ఒక్కటే అమ్మాయి టీంలో. ఆ అమ్మాయితో ఉండడానికి తోడుగా మరొకరిని ఉంచి, ఆ అమ్మాయి సేఫ్ గా ఉండడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి, పని చేయడానికి వచ్చిన అందరూ మేజర్ యాక్టర్స్/టెక్నీషియన్స్ తో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ముఖ్యంగా ఎటువంటి సెక్సువల్ అబ్యూజ్ జరిగినా వారిని ఉన్నపళంగా ఆ సినిమా నుంచి తప్పిస్తామని అగ్రిమెంట్. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కమిట్మెంట్ కామన్ అని అనుకునేవాళ్లకి, లేదు ఇలా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కూడా సినిమా నిర్మాణం జరుగుతుందని మరికొంతమందికైనా తెలియాలని. అయినా ఆవిడ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా కంప్లీట్ గా అనవసరమైన ప్రశ్న అది. అనన్య చక్కగా సమాధానం చెప్పింది. అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Show comments