NTV Telugu Site icon

Malla Reddy: మల్లారెడ్డి మాటలకు హర్టయిన బాలీవుడ్?

Chamakura Malla Reddy

Chamakura Malla Reddy

Malla Reddy Speech Targeting Ranbir Kapoor Became Hot Topic: టీడీపీ నుంచి ఎంపీ అయి తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు చామకూర మల్లారెడ్డి. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఆయన అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలు బాలీవుడ్ అభిమానులకు కోపం తెప్పించేలా ఉన్నాయి. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో యానిమల్ అనే సినిమా తెరకెక్కింది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో హీరోయిన్లతో పాటు రాజమౌళి, మహేష్ బాబుతో పాటు సినిమా యూనిట్, అలాగే మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనవసరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయడం ఒక వివాదానికి కారణమైంది. ఆయన త్వరలో ఎన్నికలు ఉన్న క్రమంలో ఈ మాటలు తన రాజకీయ ఎజెండా కోసం చేసి ఉండవచ్చు కానీ ఆ మాటలు బాలీవుడ్ అభిమానులకు కోపం తెప్పించడమే కాదు తెలుగు వారికి సైతం ఇలా మాట్లాడి ఉండకూడదు ఏమో అనిపించేలా చేసింది.

Amma Nana O Tamila Ammayi : రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ రాబోతుందా..?

ఈ ఈవెంట్ సమయంలో బాలీవుడ్ టీమ్‌కు ఘనస్వాగతం లభించగా, బీఆర్‌ఎస్ మంత్రి చామకూర మల్లా రెడ్డి స్టేజ్‌పై రణబీర్ కపూర్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇబ్బందికరం అనిపించింది. మల్లా రెడ్డి తనదైన స్టైల్ లో బిగ్గరగా మాట్లాడుతూ “వినండి మిస్టర్ రణబీర్ కపూర్.. ఐదేళ్లలోపు. హాలీవుడ్ బాలీవుడ్ ని తెలుగు వాళ్ళు శాసిస్తారు, మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ముంబై పాతబడిపోయింది, బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌.. భారతదేశంలో హైదరాబాద్‌ నగరం మాత్రమే ఇప్పుడు ఏకైక ఆప్షన్. రాజమౌళి, దిల్ రాజు చాలా తెలివైన వ్యక్తులు..ఇప్పుడు సందీప్ కూడా వాళ్లకి తోడయ్యాడు. హైదరాబాద్ టాప్ మోస్ట్ హై, తెలుగు వాళ్ళు అందరూ చాలా స్మార్ట్ గా ఉంటారు.. మన హీరోయిన్ రష్మిక కూడా స్మార్ట్. ఆమె నటించిన పుష్ప సంచలనం సృష్టించింది. ఇక్కడ కొన్నేళ్ల క్రితం అశ్వమేధ యాగం చేశాం, ఈ భూమి మంచిది, మల్లా రెడ్డి యూనివర్సిటీ భూమిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడంతో మీ యానిమల్ సినిమా 500 కోట్లు వసూలు చేస్తుందని చెప్పుకొచ్చారు.

అయితే మల్లారెడ్డి మాట్లాడిన వాటిలో కొన్ని నిజాలు లేకపోలేదు కానీ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాదు వచ్చిన ఒక టాప్ బాలీవుడ్ హీరోని మీ బాలీవుడ్ నథింగ్, మేమే తోపులం, మా తర్వాతే ఎవరైనా, మీరు కూడా ఇక్కడకి రావాల్సిందే అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మల్లా రెడ్డి స్పీచ్ విని తెలుగు ఇండస్ట్రీ సినిమాల పట్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే బాలీవుడ్ అభిమానులకి కోపం రావడం చాలా సహజం. దీంతో అభిమానుల స్పందన కూడా ఇప్పుడు కాస్త నెగటివ్ గానే కనిపిస్తోంది. నిజానికి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మల్లా రెడ్డికి ఎటువంటి దురుద్దేశాలు లేకపోవచ్చు, కానీ ఇలా రణబీర్ పేరు ప్రస్తావిస్తూ తెలుగోళ్లు తోపులు, మిగతావారంతా డమ్మీ అని అర్ధం వచ్చేలా చేసిన ఈ స్పీచ్ లేనిపోని ప్రాంతీయ వాదాలకు దారి తీస్తుంది. ఒకరకంగా నిజమైన పాన్-ఇండియా చిత్రాలను రూపొందించడానికి భారీ ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీ వాళ్లంతా నార్త్ లేదు సౌత్ లేదు ఇప్పుడు ఇండియన్ సినిమా ఒక్కటే అంటుంటే, మల్లా రెడ్డి చాలా డిఫరెంట్ గా సౌత్, అందులోనూ మన తెలుగోళ్లు తోపులు అని మాట్లాడడం నష్టం కలిగించే అంశమే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రేక్షకులు మల్లారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.