Site icon NTV Telugu

Actor Janardhan : 18 ఏళ్లు ఆమెతో ఎఫైర్ నడిపా.. నా భార్య సపోర్ట్ చేసింది

Janardhan

Janardhan

Actor Janardhan : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య అన్నీ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు యాక్టర్లు. తమ పర్సనల్ విషయాలను చెప్పడానికి అస్సలు వెనకాడట్లేదు. అంతకు ముందు ఇలాంటి విషయాలు చెప్పడానికి కొంచెం మొహమాట పడేవాళ్లు. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ఓపెన్ గానే తమ ఎఫైర్లు కూడా చెబుతున్నారు. తాజాగా మరో మళయాల నటుడు ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే జనార్థన్. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న ఆయన.. చాలా సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఆయన తాజాగా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఒక అమ్మాయితో 18 ఏళ్ల పాటు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నట్టు చెప్పాడు.

Read Also : Chiranjeevi- Ram Charan : చిరుకు కలిసొచ్చింది.. చరణ్ కు ఎదురుదెబ్బ.. రూట్ మార్చారా..?

నాకు చిన్న ఏజ్ లోనే మా బంధువుల అమ్మాయితో పెళ్లి అయింది. మాకు ఇద్దరు కూతుర్లు పుట్టారు. కానీ సంసారంలో నాకు సుఖం లేకుండా పోయింది. నా భార్యకు కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ తగ్గింది. అందుకే నేను వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాను. నేను కూడా మనిషినే కదా. అలా ఆమెతో 18 ఏళ్ల పాటు వివాహేతర సంబంధం కొనసాగించాను. ఆమె కోసం ఎన్నో చేశాను. ఆ విషయం నా భార్యకు కూడా ముందే తెలుసు. ఆమె నన్ను ఏమీ అనలేదు. ఆమె కూడా నన్ను అర్థం చేసుకుంది. నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసింది. కానీ నేను ఎఫైర్ పెట్టుకున్న మహిళ సమాజం కోసం భయపడి నన్ను దూరం పెట్టింది. ఆ ఒక్కటి తప్ప నా లైఫ్‌ లో మరో చెడు అలవాటు లేదు అంటూ తెలిపాడు జనార్థన్.

Read Also : SSMB 29 : మళ్లీ కాపీ కొట్టిన జక్కన్న..? పృథ్వీరాజ్ లుక్ అక్కడి నుంచి వచ్చిందా..!

Exit mobile version