NTV Telugu Site icon

Vijay Babu : ఆడిషన్ కు పిలిచి అత్యాచారం… పరారీలో నటుడు

Vijay Babu

Vijay Babu

మలయాళ సినీ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై కేరళలోని ఎర్నాకులంలో అత్యాచారం కేసు నమోదైంది. సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానంటూ ఆశ చూపి, అత్యాచారం చేశాడని ఓ నటి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ బాబుపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (లైంగిక వేధింపు), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం సిటీ కమిషనర్ కార్యాలయంలో ఈ కేసు నమోదైంది. తనపై కేసు నమోదైందనే విషయం తెలిసినప్పటి నుంచి విజయ్ బాబు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం లుకౌట్ నోటీసు జారీ చేయడమే కాకుండా, కేరళతో పాటు పలు ప్రాంతాల్లో అతని కోసం వెతుకుతున్నారు.

Read Also : Hombale Films : ‘కేజీఎఫ్’ మేకర్స్ చేతుల్లో రాజ్ కుమార్ మనవడి ఎంట్రీ

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26, మంగళవారం రాత్రి విజయ్ బాబు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ ఆమె ఆడిషన్ ద్వారా తన సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందని, ఆ సమయంలో తాను ఎప్పుడూ ఆమెతో చాట్ చేయలేదని పేర్కొన్నాడు. గత ఏడాది చివర్లో ఆ మహిళ తనకు మెసేజ్ చేయడం ప్రారంభించిందని, ఈ ఏడాది మార్చిలో తాను ఆమెను కలిశానని విజయ్ బాబు తెలిపాడు. అంతేకాకుండా తామిద్దరి మెసేజ్‌లకు సంబంధించిన దాదాపు 400 స్క్రీన్‌షాట్‌లను రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేస్తానని ఆయన చెప్పారు.

ఇప్పుడు కొన్ని గంటల క్రితం విజయ్ పై ఆరోపణలు చేసిన నటి ఫేస్‌బుక్ పేజీలో అసలేం జరిగిందన్న విషయాన్ని వెల్లడించింది. “నేను గత కొన్నేళ్లుగా మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నాను. నటుడు, నిర్మాత విజయ్ బాబు FRIDAY FILM HOUSE అనే సంస్థను నడుపుస్తున్నాడు. ఆయన 13/03/22 – 14/ 04/2022 నుండి లైంగిక వేధింపులతో నన్ను శారీరకంగా వేధించాడు. స్నేహం ముసుగులో దగ్గరైన అతను మత్తుమందు ఇచ్చి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేను స్పృహలో ఉన్నప్పుడు అలాంటి వాటిని తిరస్కరించేదాన్ని. గత 1 ½ నెలల్లో అతను నాపై చాలాసార్లు అత్యాచారం చేశాడు. అతని చెరలో నాలాంటి ఎంతోమంది చిక్కుకున్నారని తెలుసుకున్నాను. ఇంతకుముందు సినిమా పరిశ్రమలో అతడికి ఉన్న పలుకుబడి కారణంగా మాట్లాడాలంటే భయపడి, లోలోపలే ఏడ్చేదానిని. కానీ ఇక ఈ బాధను భరించడం నా వల్ల కాదు. నాలా ఇంకెవరికీ జరగొద్దని అనుకుని, అసలు విషయాన్ని బయటపెట్టాను. ఈ కేసులో నాకు న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అతని వల్ల ఇబ్బంది పడి, మౌనంగా ఉన్న మహిళలందరినీ బయటకు వచ్చి మాట్లాడమని నేను కోరుతున్నాను” అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది.