NTV Telugu Site icon

Mammu Kaka: మలయాళ సూపర్ స్టార్… పాన్ ఇండియా హారర్ సినిమా

Mammu Kaka

Mammu Kaka

ప్రభాస్ తో మొదలుపెడితే దుల్కర్ సల్మాన్ వరకు… నార్త్ నుంచి సౌత్ వరకు… స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు… ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే పడ్డారు. మార్కెట్ పెంచుకునే ప్రాసెస్ లో మంచి కథ వినిపిస్తే చాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఈ రేస్ లో చేరడానికి రెడీ అయ్యాడు హయ్యెస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. గత నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో, ఫేస్ ఆఫ్ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉన్న మమ్ముట్టి ఇతర భాషల్లో ఈ మధ్య చాలా తక్కువగా నటించాడు. మోహన్ లాల్ ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకున్నాడు కానీ మమ్ముట్టి మాత్రం ఇప్పటివరకూ రీజనల్ సినిమాలకి మాత్రమే పరిమితం అయ్యాడు.

Read Also: Swathistha: రజినీ కోడలు కత్తి అనుకుంటే… కమల్ కోడలు అమ్మోరు కత్తిలా ఉందే…

ఈసారి మాత్రం ఆ బ్యారియర్ ని బ్రేక్ చేస్తూ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు మమ్ము కాకా. హారర్ జానర్ లో ‘భ్రమయుగం’ అనే టైటిల్ తో మమ్ముట్టి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ అండ్ వైనాట్ స్టూడియోస్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. భ్రమయుగం… ది ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రీలుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోస్టర్ ని పుర్రెలు, పాతకాలం కోటతో డిజైన్ చేసి గూస్ బంప్స్ ఇస్తున్నారు మేకర్స్. మరి ఈ మొదటి పాన్ ఇండియా సినిమాతో మమ్ముట్టి ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.

Show comments