Malayala Premalu grabbin Attention of Hyderabadis: భారత సినిమా పరిశ్రమలో మలయాళ సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినిమా అంటే బూతు సినిమా అని అనుకున్న వారంతా ఇప్పుడు మలయాళ సినిమా కంటెంట్ కు సలాం కొడుతున్నారు. జానర్, బడ్జెట్ తో సంబంధం లేకుండా తమకు నచ్చిన సినిమాలు తీస్తూ వెళ్లడమే కాదు వాటిని కమర్షియల్ గా కూడా సక్సెస్ చేస్తూ మలయాళ సినీ దర్శకులు కొత్త సిలబస్ రాస్తున్నారు. ఇక అలా తాజాగా ఈ జాబితాలోకి చేరింది ఒక మలయాళ మూవీ ప్రేమలు. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక అలా ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారంలోనే 6 కోట్ల రూపాయల వసూళ్లను సాధించగా ఇప్పటి దాకా 30 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మలయాళ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించడం.
Gaanja Shankar: టైటిల్ ఇలానా పెట్టేది.. సాయిధరమ్ తేజ్ సినిమాపై నార్కొటిక్ బ్యూరో ఘాటు వ్యాఖ్యలు
ఇక అందులో తెలుగు వారిని అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మన తెలుగు కాదు ఇతర ఏ పరిశ్రమల మేకర్స్ చూపనంత అందంగా హైదరాబాద్ ను చూపించారు మేకర్స్. నిజానికి పక్క భాషల సినిమాల్లో హైదరాబాద్ వాతావరణాన్ని చూపించిన సినిమాలు రాలేదు. మొన్నామధ్య వచ్చిన సల్మాన్ ఖాన్ ‘కిసి క భాయ్ కిసి క జాన్’ వంటి సినిమాలో తెలంగాణ సంస్కృతిని చూపించి ఆకట్టుకున్నా పూర్తి స్థాయిలో కాదు. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నల్సేన్ కె. గఫూర్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించగా తెలుగు వారిని సైతం ఆకట్టుకుంటుంటూ ముందుకు వెళుతోంది. బూతు లేని కామెడీ, చాలా యూత్ ఫుల్ కంటెంట్ తో ఉన్న ఈ సినిమాను త్వరలో ఎవరో ఒక నిర్మాత కొనుగోలు చేసి తెలుగు డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు.
అయితే మన తెలుగు సినిమా మేకర్స్ అందరూ హైదరాబాద్ అనగానే కేబుల్ బ్రిడ్జ్ లేదా ఛార్మినార్ ఏరియల్ షాట్స్ వేసి మిగతాది అంతా ఇండోర్ లేదా స్టూడియోలో ముగించేస్తున్నారు. కానీ ఈ సినిమా దర్శకుడు మాత్రం మనం రోజు తిరిగే హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుందా అనేంతలా క్యాప్చర్ చేసి హైదరాబాదీలకు ఒక లవ్ స్టోరీ రాసినట్టు అనిపించింది.