‘పేట’ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన మాళవికా మోహనన్..ఆమె తొలిసారి దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘పట్టంపోలే’ అనే చిత్రలో నటించగా, ఆ తర్వాత ‘మాస్టర్’, ‘తంగలాన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ప్రముఖ కెమెరామెన్ కె.యు.మోహనన్ కుమార్తె అయినప్పటికీ ఆమె ఆరంభం నుండి తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా సినీ కెరీర్‌లో ముందుకు సాగుతున్న కొద్దీ, తన పాత్రల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మాళవిక మోహనన్ తెలిపారు.
Also Read : Ravi Basrur : సలార్ తర్వాత రవి బస్రూర్‌కు అంతర్జాతీయ ఆఫర్లు..!
ఇటీవల హృదయపూర్వం చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, త్వరలో ప్రభాస్‌తో రాజాసాబ్, కార్తీతో సర్దార్ 2 సినిమాల్లో నటించనున్నారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాళవిక ఇలా చెప్పారు.. “సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చినప్పుడు, పెద్ద హీరోలతో, స్టార్ డైరెక్టర్లతో పనిచేయడం ద్వారా త్వరగా కెరీర్‌లో ముందుకు వెళ్లాలని చాలా మంది భావిస్తారు. నేను మొదట్లో అలాగే అనుకున్నా. కానీ కాలక్రమేణ ఆ ఆలోచన మారింది. ఇప్పుడు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోవాలంటే బలమైన పాత్రలు చేయడం చాలా ముఖ్యం అని నమ్ముతున్నాను. పెద్ద సినిమాల్లో భాగమవ్వడం ఒక అవకాశం కావచ్చు. కానీ ఆ సినిమా లోపల మన పాత్ర బలంగా లేకపోతే, ప్రేక్షకులు గుర్తు పెట్టుకోరు. అందుకే అవకాశాలు ఆలస్యంగా వచ్చినా శక్తిమంతమైన కథల్లో నటించి, మనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకోవాలి. బాలీవుడ్‌లో కూడా ఇలాంటి ఉత్తేజకరమైన ప్రాజెక్టుల్లో భాగం కావాలని ఆశపడుతున్నా” అని మాళవిక స్పష్టం చేశారు.
