NTV Telugu Site icon

MalaShri: ఆ సినిమాలో నా నటన చూసి రామానాయుడు గారు ఆ పని చేశారు..

malashree

malashree

ప్రేమ ఖైదీ చిత్రంలో మాలా శ్రీ నటనను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోడు.. అందం, అభినయం కలగలిపిన ముద్దుగుమ్మ తెలుగులో సాహసవీరుడు సాగరకన్య, భలే మామయ్య సినిమాలలో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ ని వివాహం చేసుకొని కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగింది. ఇక ఎన్నో ఏళ్ళ తరువాత తెలుగు బుల్లితెరపై ఆమె సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది.

“మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం.. అందుకే ఒకే ఏడాదిలో 14 సినిమాలు చేశాను. ఇక ప్రేమ ఖైదీ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ సినిమా హిట్ అయ్యినందుకు రామానాయుడు గారు మా అందరికి వాహనాలు గిఫ్ట్ ఇచ్చారు.. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం.. అలాంటి నిర్మాతను మరెక్కడా చూడలేదు. ఇక కన్నడ నిర్మాత రాముతో కలిసి ‘ముత్యంలాంటి పెళ్ళాం’ సినిమా కు అడిగిన వెంటనే చేశాను. అప్పుడే అన్నాను ఆయనతో మీకు ముత్యం లాంటి పెళ్ళాం వస్తుందని.. చివరకు నేనే ఆయనకు భార్యగా వెళ్లాను.. గతేడాది నా భర్త చనిపోయారు.. ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.