Malaika Arora : బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. 50 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్, ఫ్యాషన్, బ్యూటీ పరంగా ఎప్పుడూ స్పాట్‌లైట్‌లో ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మనకు తెలిసిందే కదా.. ఆమె తన కంటే 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. ఈ మధ్య వీరిద్దరూ పెద్దగా బయటకు కనిపించట్లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
Read Also : Allu Sirish : మెడలో నెక్లెస్ తో శిరీష్ ఎంగేజ్ మెంట్.. తాజా ఫొటోలు చూశారా
వ్యక్తిగత జీవితం, సంబంధాల గురించి ఈమెకు ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ, “ప్రతి వ్యక్తికీ తన జీవితాన్ని తన ఇష్టానుసారం గడపడానికి హక్కు ఉంది. మనసుకు నచ్చిన వ్యక్తితో శృంగారం చేయడంలో తప్పు లేదు. దానికి పెళ్లి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్వేచ్ఛగా జీవించడం చాలా ముఖ్యం” అని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నానా రచ్చ జరుగుతోంది. కొందరు ఆమె అభిప్రాయాన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా చూస్తుండగా, మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్‌గా చేయడం తగదని విమర్శిస్తున్నారు.
Read Also : SS Rajamouli : ప్రభాస్ ను అలాంటి బట్టల్లో చూసి షాక్ అయ్యా.. రాజమౌళి కామెంట్స్
