యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన గ్రామీణ యాక్షన్ డ్రామా “కొండపొలం”. సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలోకి రాబోతోంది. విడుదలకు ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా “కొండపొలం” మేకర్స్ మేకింగ్ వీడియోను ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం ఒక అడవిలో క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారి, ఎడతెగని వర్షాల మధ్యలో సినిమా షూటింగ్ కోసం బృందం ఎలా శ్రమించిందో ఈ వీడియోలో చూపించారు.
Read Also : సమంత విడాకులపై మౌనం వీడిన తండ్రి
ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అడ్వెంచరస్ రైడ్‌ని థియేటర్లలో ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారణంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, సాయిబాబు, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.