Site icon NTV Telugu

Bhagavanth Kesari: ఇట్స్ సింహం రోరింగ్ టైమ్… బిగ్ ఈవెంట్ లోడింగ్!

Bhagavanth Kesari

Bhagavanth Kesari

అఖండ, వీర సింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరిగా వస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడీగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా వరంగల్‌లో గ్రాండ్‌ ఈవెంట్‌తో ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది భగవంత్ కేసరి. ఖచ్చితంగా ఈ సినిమా బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని అంటున్నారు.

Read Also: Thala Ajith: AK62 గురించే సౌండ్ లేదు… ఇక అప్పుడే AK63 గురించి మాట్లాడుతున్నారు

ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. భారీ ఎత్తున ‘భగవంత్ కేసరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లిమిటేడ్‌గానే మాట్లాడాడు బాలయ్య. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 14 లేదా 15న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంత? అనేది పక్కన పెడితే.. ఒకవేళ పవన్ నిజంగానే వస్తే మాత్రం అభిమానుల తాకిడిని తట్టుకోవడం కష్టమే. కానీ బాలయ్య రోరింగ్ మాత్రం ఈ ఈవెంట్‌లో ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. రేపో మాపో భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Read Also: Leo: తమిళనాడు గవర్నమెంట్ నో అనింది… ఈవెంట్ కోసం హైదరాబాద్ వస్తున్నారు…

Exit mobile version