NTV Telugu Site icon

Tollywood : నిర్మాతలకు గుదిబండలా మారుతున్న డాన్సర్లు

War2

War2

చిత్ర పరిశ్రమలో ప్రెజెంట్ హీరో హీరోయిన్లపై ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నామంటే అదొక ప్రెస్టిజియస్ ఇష్యూగా మారిపోయింది. వందల కొద్దీ డ్యాన్సర్స్ ఉంటేనే పాట క్లిక్ అవుతుందని ఫీలవుతున్నట్లున్నారు. వంద దగ్గర నుండి సంఖ్య వేలకు చేరుతోంది. ఒక హీరోను చూసి మరో హీరో అదే ఫార్మాట్ వర్కౌట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. భోళాశంకర్ స్పెషల్ సాంగ్ కోసం 200 మంద డ్యాన్సర్లను దింపితే పుష్ప2లో సూసేకీ అగ్గిమాదిరి సాంగ్ కోసం ఏకంగా 500 మంది డ్యాన్సర్లను పట్టుకొచ్చాడు గణేశ్ ఆచార్య.

Also Read : Robinhood : అదిదా సర్ప్రైజ్ ప్రోమో.. మల్లెపూలతో మత్తెక్కిస్తున్న ‘కేతిక కెవ్వు కేక’

దేవర ఆయుధ పూజ సాంగ్ కోసం 2వేల మంది పాల్గొన్నారని టాక్. అలాగే చరణ్ జరగండి సాంగ్ కోసం సెట్టే కాదు డ్యాన్సర్లు కూడా హైలెటైన సంగతి తెలిసిందే. తండేల్‌లో నమో నమో శివాయ కోసం 400మంది డ్యాన్సర్లు వర్క్ చేశారని టాక్. ఇప్పుడు వార్ 2 కోసం 500 మంది డ్యాన్సర్లు పాల్గొననున్నారు. స్పెషల్‌గా డిజైన్ చేసిన సెట్‌లో ‌హృతిక్, తారక్‌లతో కాలు కదపనున్నారు డ్యాన్సర్లు. సాయి తేజ్ హీరోగా వస్తున్న సంబరాల ఏటిగట్టులో స్పెషల్ సాంగ్ కోసం వెయ్యి మంది డ్యాన్సర్స్ తో లావిష్ సాంగ్ కంపోజ్ చేయనున్నారన్న వార్త రావడంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. అలాగే సల్మాన్ సికిందర్ కోసం ఏకంగా 500 మంది టర్కిష్ డ్యాన్సర్లను పట్టుకొస్తున్నారని సమాచారం. ఓ పాట కోసమే ఇంత మందిని తీసుకురావడం నిర్మాతలకు ఖర్చుతో కూడుకున్నదే. అయినప్పటికీ వెనుకాడకుండా బడ్జెట్ కేటాయిస్తున్నారు. సినిమాను నిలబెడుతుందేమోనన్న ఆశ. ఇద్దరు వేసినా అవే స్టెప్పులు, గ్రూపుగా వేసినా అవే డ్యాన్సులు మరి ఈ కొత్త ఫాంటసీ టాలీవుడ్, బాలీవుడ్‌ లను ఎంత వరకు తీసుకెళుతుందో.