NTV Telugu Site icon

Rajinikanth: జైలర్ తెలుగు ప్రమోషన్స్ లైట్ తీసుకున్నారా?

Rajinikanth

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు ప్రభుత్వాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా హాలిడేస్ ప్రకటించేవి. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రజినీ సినిమాకి ఉండే క్రేజ్ అసలు ఏ హీరోకి ఉండేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రేంజ్ సినిమాతో రజిని ఆడియన్స్ ని పలకరించట్లేదు. ఈ కారణంగా రజిని సినిమా రిలీజ్ అయితే ఉండే హంగామా కనిపించకుండా పోతుంది. లేటెస్ట్ గా మరీ దారుణంగా ఉంది పరిస్థితి, రజిని సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్ అవుతున్నా అసలు బజ్ అనేదే లేదు. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాతో థియేటర్స్ లోకి రావడానికి రెడీగా ఉన్నాడు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మరో నెల రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ఒక సాంగ్ వచ్చింది, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ రజినీ సినిమాకి ఉండే హైప్ క్రియేట్ చేయలేకపోయింది.

తమిళ్ లోనే జైలర్ ప్రమోషన్స్ అంతంతమాత్రంగా ఉన్నాయి అంటే ఇక ఇతర భాషల పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కూడా జైలర్ సినిమాలో నటించారు. పర్ఫెక్ట్ గా ప్రమోషన్స్ చేస్తే జైలర్ దెబ్బకి సౌత్ బాక్సాఫీస్ షేక్ అయ్యేది కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో చాలా నీరసంగా ఉన్నారు. తెలుగులో అయితే లిటరల్లీ జీరో ప్రమోషన్స్. ఇంటెన్షనల్ గా జైలర్ ప్రమోషన్స్ ని చెయ్యకుండా ఉంటున్నారో లేక మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్స్ దొరకవులే ప్రమోషన్స్ చేసి ఉపయోగం ఏముందిలే అనుకున్నారా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జైలర్ సినిమాకి ఓపెనింగ్స్ కూడా వచ్చేలా కనిపించట్లేదు. సినిమా అద్భుతంగా ఉంటే కాని కలెక్షన్స్ లో బూస్ట్ కనిపించదు.