Site icon NTV Telugu

Mohan Lal : మోహన్ లాల్ కు భారీ ఎదురుదెబ్బ..

Mohanlal

Mohanlal

Mohan Lal : మోహన్ లాల్ కు కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మనకు తెలిసిందే కదా.. మోహన్ లాల్ ను ఎప్పటి నుంచో ఏనుగు దంతాల కేసు వెంటాడుతోంది. 2012లో మోహన్ లాల్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లో రెండు ఏనుగు దంతాలు దొరికాయి. వన్యప్రాణుల చట్టానికి విరుద్ధంగా అలంకారం కోసమే మోహన్ లాల్ ఇంట్లో ఏనుగు దంతాలను పెట్టుకున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాను ప్రభుత్వ అనుమతితోనే ఆ ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్టు అప్పట్లోనే మోహన్ లాల్ పోలీసులకు వివరించారు. ప్రభుత్వ పర్మిషన్ కు సంబంధించిన పేపర్లను కూడా చూపించారు.

Read Also : Prabhas : మరో సీక్వెల్ లో ప్రభాస్..?

ప్రభుత్వం కూడా మోహన్ లాల్ కు తామే పర్మిషన్ ఇచ్చామని వివరించింది. చనిపోయిన ఏనుగు దంతాలనే మోహన్ లాల్ తన ఇంట్లో పెట్టుకున్నారని చెప్పింది. కానీ అప్పటి నుంచి కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. తాజాగా కోర్టు విచారణలో.. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన లెటర్ ను రద్దు చేసింది ధర్మాసనం. ఎవరి ఇష్టాను సారంగా వాళ్లు పర్మిషన్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. చట్టాలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇవ్వడం ఏంటని మండిపడింది. అంతే కాకుండా తన మీద కేసు కొట్టేయాలంటూ మోహన్ లాల్ వేసిన పిటిషన్ ను కూడా కొట్టేసింది. దీంతో ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందా అని మోహన్ లాల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Read Also : Rashmika: మీడియా ముందుకు రష్మిక.. పెదవి విప్పేనా?

Exit mobile version