టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మేజర్’. జూన్ 3వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాను.. ఎన్నడు లేని విధంగా సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో మేజర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు అర్పించిన వీరజవాను మేజర్ ఉన్ని సందీప్ కృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ తెరకెక్కింది. దాంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. ‘మేజర్’ సినిమాకు సెన్సార్ సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి సెల్యూట్ చేయడంతో.. అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రీమియర్ షోలతో.. దేశంలోని తొమ్మిది నగరాలలో.. విడుదలకు పదిరోజుల ముందు నుంచే సందడి చేస్తోంది. దాంతో ఓ వైపు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తునే.. మరో వైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది మేజర్.
‘భారతీయ సినీ చరిత్రలో మొదటిసారిగా సినిమా చూసిన తర్వాత.. ప్రేక్షకులతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం..This is not daring. This is Major Sandeep Unnikrishnan.. అని సోషల్ మీడియాలో ఈవెంట్ డేట్ అనౌన్స్ చేశాడు అడివిశేష్. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మే 29న వైజాగ్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులుగా ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఈ సినిమాని మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్.. ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇండియా ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దాంతో ఈవెంట్‌కు టాలీవుడ్ టాప్ స్టార్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్‌లో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శోబిత ధూళిపాళ్ల కీలక పాత్రలో కనిపించనుంది. మరి మేజర్ మూవీ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.
