Site icon NTV Telugu

Major: రియల్ హీరో ‘మేజర్’ సందీప్ వీర గాధ.. ఓటిటీ లో వచ్చేది ఎప్పుడంటే..?

Major Special Previews

Major Special Previews

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన చిత్రం ‘మేజర్’. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరక్కించారు. జూన్ 3 న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు రాష్ట్ర ముఖ్యమంత్రుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటిటీలో అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారీ ధర పెట్టి సొంతం చేసుకున్న విషయం విదితమే.

ఇక తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. జూలై 3 న మేజర్ ఓటిటీ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు తో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమా జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గత నెల 3 న రిలీజ్ అయిన ఈ సినిమా నెల తరువాత అదే డేట్ కు ఓటిటీలో రిలీజ్ కావడం విశేషం. ఇకపోతే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. మరి థియేటర్లో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version