కెరీర్ మొదటి నుంచి వైవిధ్యంగా ముందుకు సాగుతూ.. కథా బలమున్న సినిమాలు చేస్తు.. వరుస విజయాలు అందుకుంటున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఈ టాలెంటెడ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘మేజర్’. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా.. ఈ సినిమా రూపొందుతోంది. అడివి శేష్ చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో.. మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది.
ఇక ఈ సినిమా రిలీజ్ గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమాను వేసవి కానుకగా మే 27న రిలీజ్ చేయాలనుకున్నారు.. కానీ అదే రోజు ఎఫ్ త్రీ మూవీ రిలీజ్ ఉండడంతో.. వన్ వీక్ తర్వాత అంటే.. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్ చేశారు. ముంబైలో చిన్న ఈవెంట్ ను ఏర్పాటు చేసి.. మే 9న ‘మేజర్’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మూడు భాషల్లో చిత్రీకరించినట్లు నటి శోభితా దూళిపాళ్ల వెల్లడిస్తూ.. ఓ వీడియోను షేర్ చేసింది. ఈ చిన్న ట్రైలర్ కట్‌లో ఒకే సీన్ ను వేర్వేరు భాషల్లో డైలాగ్స్ చెప్పించారు. ఈ వీడియో అదరహో అనేలా ఉండడంతో.. ట్రైలర్ ఇంకెలా ఉంటుందోనని ఆసక్తి క్రియేట్ చేస్తోంది. మరి అంచనాలను పెంచేస్తున్న మేజర్ ఎలా ఉంటుందో చూడాలి.
