అచ్చతెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సందర్భానుసారం మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తమ సినిమాల విడుదల సమయంలో టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం హీరోహీరోయిన్లకు అలవాటే. అంతేకాదు… బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి గెస్టులుగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆహాలో ఈ వారం రెండు కార్యక్రమాలలో ‘మేజర్’ మూవీ టీమ్ సందడి చేయబోతోంది.
ముంబై దుర్ఘటనలో అశువులు బాసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపుదిద్దుకుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడివి శేష్ పోషించారు. అలానే తెలుగు అమ్మాయి శోభితా దూళిపాళ ఇందులో కీలక పాత్రను చేసింది. ఈ శుక్రవారం ఆహాలో ప్రసారమయ్యే ప్రదీప్ మాచిరాజు ‘సర్కార్ -2’లో అడివి శేష్, శోభిత, సాయి మంజ్రేకర్, శశికిరణ్ తిక్క పాల్గొన్నారు. అలానే ఈ వీకెండ్ లో టెలీకాస్ట్ అయ్యే తెలుగు ఇండియన్ ఐడిల్ కూ అడివి శేష్, శోభిత హాజరయ్యారు. అక్కడ వైష్ణవి పాడిన పాటకు ఫిదా అయిన అడివి శేష్ ఆమెతో కలిసి స్టేజ్ మీద స్టెప్పులేయడం విశేషం. జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ‘మేజర్’ మూవీకి సంబంధించిన కొన్ని విశేషాలను అడివి శేష్ అండ్ శోభిత ఈ కార్యక్రమాలలో రివీల్ చేశారట. సో… వెయిట్ అండ్ వాచ్!!
