NTV Telugu Site icon

Mahi V Raghav: డిస్నీ+ హాట్‌స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!

Mahi V Raghav Counter

Mahi V Raghav Counter

Mahi V raghav strong counter to a webportal: ఒకప్పుడు తెలుగు దర్శకులు అలాగే నిర్మాతలు కేవలం సినిమాల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలు విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ కూడా ప్రొడ్యూస్ చేసేందుకు, డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న మహి వీ రాఘవ ఇటీవల సైతాన్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు అందరికీ షాక్ ఇచ్చాడు. వాస్తవానికి పాఠశాల అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన ఆయన తర్వాత ఆనందోబ్రహ్మ అనే సినిమాతో హిట్టు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించిన యాత్ర సినిమా సూపర్ హిట్ కావడంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ల లీగ్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఈ మధ్యన ఆయన హాట్ స్టార్ కోసం సేవ్ ది టైగర్స్ అనే ఒక వెబ్ సిరీస్ రూపొందించారు.
Leo Telugu Rights: ఆకాశాన్నంటేలా విజయ్ లియో తెలుగు రైట్స్?
దానికి ఆయన షో రన్నరుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో సొంత నిర్మాణంలో సైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ చేశాడు. తెలుగు సహా కన్నడ యాక్టర్స్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించడమే కాదు రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తిగా బూతులతో నిండిపోయిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే హాట్స్టార్ లో ఇప్పటివరకు వచ్చిన వెబ్ సిరీస్ అన్ని చాలా సెన్సిబుల్గా ఉండేవి. ఈ క్రమంలో హాట్ స్టార్ పరువు తీశారు అంటూ ఒక పోర్టల్ సదరు డైరెక్టర్ మీద ఒక ఆర్టికల్ ప్రచురించింది. దానికి ఆయన ఘాటుగా స్పందించారు. ఈ విషయం మీద నేను చెప్పాలనుకున్నది చెబుదామనుకున్నాను కానీ ఒక విషయం గుర్తొచ్చి ఆగిపోయానని అన్నారు. ఆ విషయం ఏమిటంటే బురదలో పొర్లాడే పందితో మనం గొడవ పడకూడదు ఎందుకంటే ఆ బురద మనకి కూడా అంటుంది , ఆ బురద పందికి ఇష్టమే కానీ మనకు కాదు కదా అంటూ ఆయన ఘాటుగా స్పందించాడు.