Mahi V Raghav: సీజన్ 2పై ఒత్తిడి.. అయినా అందుకే సూపర్బ్ రెస్పాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahi V Raghav Comments on Save the Tigers 2 Sucess: డైరెక్టర్ మహి వి.రాఘవ్ షో రన్నర్ గా రూపొందించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఈ వెబ్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1 బ్లాక్ బస్టర్, తర్వాత ‘సైతాన్’ సూపర్ హిట్ అయింది, ఇక ఇప్పుడు ‘సేవ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే యాత్ర 2 కి కూడా మంచి సినిమా అంటే టాక్ వచ్చింది. దీంతో మహి వి.రాఘవ్ హ్యాట్రిక్ హిట్స్ సాధించి టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రైటర్, నిర్మాత, దర్శకుడిగా ఇప్పటికే తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు మహి. తన త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూనే షో రన్నర్‌గానూ వెబ్ సిరీస్‌లను కూడా రూపొందిస్తూ షో రన్నర్‌గా సూపర్ హిట్స్‌ను అందించారు. ఇక తాజాగా ఈ విజయాల గురించి స్పందించారు ‘‘ఇంత మంచి విజయాలను అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ప్రతి రోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్ ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశామని అన్నారు.
Priyanka Jain: చిరుత ఎటాక్ చేసిందంటూ వీడియో పోస్ట్ చేసిన నటి.. ఇదేం పైత్యం ప్రియాంకా?
Also Read
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
- Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
- Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
నటీనటులు అద్భుతంగా నటించారు, దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చిందన్నారు. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి ప్రయత్నిస్తా, అలా చేశా కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు మహి.వి.రాఘవ్. సేవ్ ది టైగర్స్ సీజన్ 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే, సీజన్ 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశామని అన్నారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 1 చాలా పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్ 2పై ఒత్తిడిగా ఫీలయ్యా, ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరమన్నారు. అందుకే మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం, అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం అని అన్నారు. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటామని అన్నారు. త్వరలోనే మరికొన్ని వెబ్ షోలను రూపొందించటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు మహి.వి.రాఘవ్.
తాజావార్తలు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!