Site icon NTV Telugu

SSMB : పండుగాడి పాస్ పోర్ట్ తిరిగొచ్చింది..

Ssmb 29

Ssmb 29

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా ‘SSMB29’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే వారానికి ఓ సారి విదేశీ పర్యటనకు వెళ్తున్న మహేశ్ బాబు ను సింహాన్ని బోనులో బంధించినట్టు బందించి.. మహేశ్ పాస్ పోర్ట్ ను లాక్కున్నట్టు ఫోటోకు పోజ్ ఇచ్చారు. సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : NTR : ఎన్టీఆర్.. నెల్సన్.. వేరే లెవల్ వర్మ

ఇటీవల SSMB29 షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు రాజమౌలి. ఇప్పటికే ఒరిస్సా షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసాడు. హైదరాబాద్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. కాగా ప్రస్తుతం షూట్ కు చిన్న బ్రేక్ ఇవ్వడంతో వెంటనే విదేశీయానానికి పయనమయ్యాడు మహేశ్ బాబు. ముద్దుల తనయ సితార ఘట్టమనేని కలిసి ఎయిర్ పోర్ట్ లో మహేశ్ బాబు విదేశాలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తన నుండి రాజమౌళి లాక్కున్న పాస్ పోర్ట్ ను తాను తిరిగి తీసుకున్నాను అని పాస్ పోర్ట్ ను చూపిస్తున్న మహేశ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. పండు గాడి పాస్ పోర్ట్ తిరిగొచ్చింది. ఇక మనల్ని ఎవడు ఆపలేడు. నువ్వు పాస్ పోర్ట్ లాక్కుంటే బయపడానికి ఆయన స్టార్ కాదు సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 

Exit mobile version