సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు. దీంతో ఇప్పటి నుంచే తమకు ఇష్టమైన నటుడిపై అభిమానం చూపించుకోవడానికి పలు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం సూపర్ స్టార్ స్వయంగా అభిమానులకు తన బర్త్ డే విష్ ఏంటో తెలియజేశారు. ఆ ప్రత్యేక రోజున తన ఫ్యాన్స్ ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సపోర్ట్ చేయాలని స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనను ట్యాగ్ చేయాలని, అలా చేస్తే ఎవరెవరు మొక్కలు నాటారో తాను చూడగలనని మహేష్ అన్నారు. ఈ పుట్టినరోజు నాడు తన అభిమానులు అందరూ మహేష్ కోరికను తీర్చి తీరాల్సిందే. ఎందుకంటే మొదటిసారి, అది కూడా బర్త్ డే రోజున మహేష్ చేసిన స్పెషల్ రిక్వెస్ట్ కాబట్టి.
Read Also : చెల్లెలి ‘షవర్ సీక్రెట్’ బయటపెట్టిన అర్జున్ కపూర్!
ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ విషయాన్నీ ప్రకటిస్తూ ఇటీవలే “సర్కారు వారి పాట” మేకర్స్ రిలీజ్ చేసిన మహేష్ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ తో ట్రీట్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
