SSMB28:సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. నిన్ననే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. హారిక అండ్ హాసిని బ్యానర్ ఎస్, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేష్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇక నిన్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిందో లేదో అప్పుడే ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాను ప్రారంభిస్తూ మేకర్స్ #SSMB28Arambham అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం విదితమే.
ఇక ఈ హ్యాష్ ట్యాగ్ లో ఆరంభం అనేదాన్ని హైలైట్ గా చూపించడంతో ఈ చిత్రానికి ఆరంభం అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కు అ సెంటిమెంట్ ఉన్న విషయం తెల్సిందే. అల వైకుంఠపురంలో, అరవింద సమేత, అజ్ఞాతవాసి, అఆ… ఇలా అన్ని సినిమాలకు మాటల మాంత్రికుడు అ అనే అక్షరం కలిసేలా పెడుతూ ఉంటాడు. దీంతో ఈ సినిమాకు కూడా ఆరంభం అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. మహేష్ క్యారెక్టర్ కు తగ్గట్టు టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా టైటిల్ ఎలా ఉండనుండో చూడాలంటే ఇంకొన్నిరోజులు వేచి చూడకతప్పదు.
