NTV Telugu Site icon

Mahesh Babu: తల్లి చివరి కోరిక తీర్చలేని మహేష్.. ఇప్పుడు కుమిలిపోతున్నాడట

Mahesh

Mahesh

Mahesh Babu: కొన్నిసార్లు తల్లిదండ్రుల కోరికను పిల్లలు తీర్చలేకపోతారు. వారు పోయాకా ఆ కోరికను తీర్చలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నాడట మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం విదితమే. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె మరణంతో ఘట్టమనేని ఇంత తీవ్ర విషాదం నెలకొంది. ఇక నాన్నమ్మ మృతిని చిన్నారి సితార తట్టుకోలేకపోవడం, ఆమె భౌతిక కాయం ముందు కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం చూపరులను సైతం కంటనీరు పెట్టించాయి. సాంప్రదాయ పద్దతిలో మహేష్, తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే మహేష్, తన తల్లి ఆఖరి కోరికను నెరవేర్చలేకపోయానే అన్న బాధతో కుమిలిపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఇందిరా దేవి బ్రతికి ఉన్నప్పుడు.. మహేష్ కూతురు సితార ఓణీల ఫంక్షన్ చూడాలని ఆశపడిందట. ఆ విషయాన్నీ మహేష్ కు చెప్పగా.. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు..? తరువాత చూద్దాంలే అని చెప్పడంతో ఆమె మౌనంగా ఉండిపోయిందట. ఇక పండుగ సమయంలో సితార పట్టుబట్టలో కనిపించినా, లంగా జాకెట్ లో కనిపించినా ఆమె ఎంతో మురిసిపోయేవారట. ఇక ఆ వేడుక చూడకముందే ఇందిరా దేవి కన్నుమూసినట్లు చెప్తున్నారు. ఆమె బ్రతికి ఉన్నప్పుడే సితార వేడుక జరిగి ఉంటే.. ఎంతో సంతృప్తితో ఉండేవారని, మహేష్ ఆ సమయంలో ఓకే చెప్పి ఉంటే బావుండేదని అంటున్నారు. ఏదిఏమైనా తల్లి చివరి నిమిషాల్లో కొడుకుగా మహేష్ తన పక్కనే ఉంటూ అన్ని జాగ్రత్తగా చూసుకున్నాడట. ఆ కోరిక పక్కన పెడితే.. ఇందిరాదేవి చివరి నిమిషంలో కూడా కొడుకును చూస్తూనే కన్నుమూసింది.

Show comments