Site icon NTV Telugu

SSMB 29 : సింహంతో మహేశ్ బాబుకు సీన్స్.. కార్తికేయ పోస్టు వైరల్

Ssmb 29

Ssmb 29

SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ మూవీకి గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు రాజమౌళి. అంటే ప్రపంచ వ్యాప్తంగా తిరిగే వ్యక్తి అన్నమాట. రాఖీ పండుగ రోజు ప్రీ లుక్ ను రిలీజ్ చేశాడు జక్కన్న. అందులో మహేశ్ ముఖం కనిపించకుండా మెడలో వేసుకున్న దండను హైలెట్ చేస్తూ లుక్ ను రిలీజ్ చేశారు. నవంబర్ లో పూర్తి లుక్ ను రిలీజ్ చేస్తానని తెలిపారు.

Read Also : Sai Durga Tej : నాకు ఆమెనే గుర్తొస్తోంది.. సాయిదుర్గాతేజ్ ఫన్నీ కామెంట్స్

తాజాగా రాజమౌళి కొడుకు కార్తికేయ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ బాబు ల్యాప్ ట్యాప్ లో సింహాన్ని చూస్తున్నాడు. అది సింహంతో సీన్ కు సంబంధించిన పిక్ అని తెలుస్తోంది. సింహంతో మహేశ్ బాబుకు సీన్స్ భారీగానే ఉంటాయనే హింట్ ఈ పిక్ తో ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో సౌత్ ఆఫ్రికా అడవులకు రాజమౌళి వెళ్లి సింహం పిక్స్ ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్ బాబు ఆ సీన్స్ లోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also : Tollywood : రేపు ఫెడరేషన్, ఛాంబర్ భేటీ.. ముగింపు పలుకుతారా..?

Exit mobile version