NTV Telugu Site icon

“హ్యాపీ 15 మై సన్”… గౌతమ్ కు మహేష్ విషెస్

Mahesh-Babu

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 15 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్‌ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన పోస్ట్‌ను పంచుకుంటూ “హ్యాపీ 15 మై సన్ !! నువ్వు ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడూ నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను! వెళ్లి ప్రపంచాన్ని జయించు… లవ్ యు జిజి” అంటూ ట్వీట్ చేశారు. ఇక గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ అభిమానులు ట్విట్టర్‌లో #HBDPrinceGautam అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు ట్విట్టర్‌లో షేర్ చేసిన పిక్చర్‌ లో గౌతమ్ తన తండ్రి భుజంపై చేయి వేసి కనిపిస్తున్నాడు. ఈ ఫోటోను ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ క్లిక్ చేసారు.

Read Also : సూపర్ స్టార్ ఫ్యామిలీలో మరో ప్రిన్స్… గౌతమ్ బర్త్ డే

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులకు 2006 ఆగస్టు 31న గౌతమ్ జన్మించాడు. అలాగే మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” చిత్రంలో గౌతమ్ చిన్న పాత్రలో తొలిసారిగా నటించాడు.

ఇదిలా ఉండగా మహేష్ బాబు చివరిసారిగా “సరిలేరు నీకెవ్వరు” అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో కనిపించాడు. ఈ చిత్రానికి విమర్శకుల నుండి సానుకూల స్పందన లభించింది. ప్రస్తుతం మరో యాక్షన్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు మహేష్. ఇందులో మహేష్ కీర్తి సురేష్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Show comments