Site icon NTV Telugu

Mahesh Babu: భోళా శంకర్ పై మహేష్ ట్వీట్.. అతనికోసమేనా.. ?

Mahesh

Mahesh

Mahesh Babu: టాలీవుడ్ లో హీరోలు అందరూ ఒకటే. అప్పుడప్పుడు సినిమాల విషయంలో ఫాన్స్ కొట్టుకున్నా కూడా హీరోలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకరి సినిమాను ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందులో మెగా కుటుంబం, సూపర్ స్టార్ కుటుంబం ముందుంటుంది. మంచి సినిమా కానీ, చిన్న సినిమా కానీ.. ఏదైనా సరే వారికి నచ్చితే రేంజ్ ను పట్టించుకోకుండా సపోర్టుగా ఉంటారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు తప్ప మహేష్ కు ఇంకా ఏమీ తెలియదు. సినిమా ఏదైనా సరే ఎంజాయ్ చేస్తూ చూడడం మాత్రమే మహేష్ కు అలవాటు. తాజాగా మహేష్.. భోళా శంకర్ టీమ్ కు బెస్ట్ విషెష్ తెలిపాడు. చిరంజీవి తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది.

Posani Krishna Murali: టికెట్ రేట్స్.. చిరంజీవి ముందే చెప్పా.. కాదని చెప్తే చెప్పుతో కొట్టుకుంటా

ఇక ఈ సినిమాకు బెస్ట్ విషెస్ తెలుపుతూ మహేష్ ట్వీట్ చేశాడు. ” భోళా శంకర్ కోసం ఎదురుచూస్తున్నాను. చిరంజీవి సర్ కు, నా ప్రియ స్నేహితుడు మెహర్ రమేష్ కు, నిర్మాత అనిల్ సుంకర కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మొదటి నుంచి మెహర్ రమేష్, మహేష్ బాబు మంచి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ స్నేహితులు మాత్రమే కాకుండా బిజినెస్ పార్టనర్స్ కూడా. AMB సినిమాస్ లో మెహర్ కూడా ఒక వాటాదారుడు అన్న విషయం తెల్సిందే. ఇక ఆ స్నేహం కొద్దే మహేష్ ఈ ట్వీట్ చేశాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక చిరు- మహేష్ మధ్య బంధం కూడా బలంగానే ఉంటుంది. మహేష్ ట్వీట్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ సైతం భోళా శంకర్ పై ఆసక్తి చూపిస్తున్నారు. మరి రేపు చిరు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Exit mobile version