Site icon NTV Telugu

మహేష్ బాబుకు సర్జరీ… “సర్కారు వారి పాట”కు బ్రేక్ ?

Mahesh-Babu

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ జరగబోతోంది అంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు మోకాలికి చిన్న గాయం అయింది. దీంతో కొన్ని రోజులుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయన రెండు మూడు నెలల పాటు షూటింగ్‌కు విరామం తీసుకోవచ్చని సమాచారం. మహేష్ మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నాడని అంటున్నారు. దీనికి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం.

Read Also : ‘అఖండ’ విజయం సాధించాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి ?

మహేష్ బాబుకు 2014 నుండి మోకాలికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. రెస్ట్ లేకుండా వరుసగా సినిమా షూటింగులో పాల్గొనడం, బిజీ షెడ్యూల్ కారణంగా అప్పటి నుంచి ఆయన సర్జరీ చేయించుకోలేకపోయాడు. 2020లో సర్జరీ చేయించుకోవాలని అనుకున్న కరోనా మహమ్మారి కారణంగా కుదరలేదట. ఇప్పుడు ఆయన మళ్లీ తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్న కారణంగా సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. “సర్కారు వారి పాట” ఏప్రిల్ 1న విడుదలై దాదాపుగా షూటింగ్ పూర్తి దశకు వచ్చింది. మోకాలి సర్జరీకి ఇదే సరైన సమయం అని భావించిన మహేష్ వచ్చే ఏడాది మిగిలిన భాగం సినిమా షూటింగ్ ను పూర్తి చేయడానికి సిద్ధమవుతాడని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మహేష్ ఇంత వరకూ స్పందించలేదు.

మహేష్ గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు”లో కనిపించాడు. ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ చేస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు, మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

Exit mobile version