NTV Telugu Site icon

SSMB28: వచ్చేసింది.. వచ్చేసింది.. మహేష్ అప్డేట్ వచ్చేసింది

Mahesh

Mahesh

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో SSMB28 చేస్తున్న విషయం తెల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ సడెన్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే నాగవంశీ ఈ సినిమాను సంబందించిన అప్డేట్ వస్తుంది అని, మహేష్ అభిమానులకు పూనకాలే అని చెప్పి ఇంకా హైప్ పెంచేశారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే ఈ ఏడాది మహేష్ ను అభిమానులు థియేటర్ లో చూడడం కష్టమనే చెప్పాలి.

అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే..

అవును.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు దీంతో పాటు మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మహేష్ లుక్ చూస్తుంటే అభిమానులు బట్టలు చిచ్చికోవడం ఖాయమని చెప్పాలి. అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్న ఊర మాస్ లుక్ లో అదరగొట్టేశాడు. బ్లాక్ షర్ట్, నోట్లో సిగరెట్.. సీరియస్ లుక్ తో నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో లారీలు, విలన్లు.. మహేష్.. విలన్ల దుమ్మురేగొట్టి.. ఎంచక్కా సిగరెట్ తాగి రిలాక్స్ అవుతున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Show comments