NTV Telugu Site icon

Mahesh Babu: నాకు బాగా దగ్గరున్నవాళ్ళు దూరమయ్యారు.. ఎమోషనల్ అయిన మహేష్..

Maheshh

Maheshh

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ఒక బెస్ట్ వర్క్ గా నిలిచిపోయేదిలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ వేదికపై మహేష్ మాట్లాడుతూ “చాలా ఆనందంగా ఉంది మిమ్ములందరిని ఇలా చూడడం.. రెండేళ్లు అయిపోయింది అనుకుంటాను మన అందరికి ఇలాంటి ఫంక్షన్ జరగడం.. ముందుగా పరుశురామ్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. సర్కారువారి పాటలో ఆయన నా క్యారెక్టర్  చాలా ఎక్స్ట్రార్డినరీ గా డిజైన్ చేశారు. నిజం చెప్పాలంటే అది నాకు ఫెవరేట్ క్యారెక్టర్ గా మారిపోయింది. నా డైలాగ్ మాడ్యులేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ , మ్యానరిజమ్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ టోటల్ గా ఆయన డిజైన్ చేసిందే. నేను చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేశాను.. నిజం చెప్పాలంటే కొన్ని సీన్లు అయితే యాక్ట్ చేసేటప్పుడు  పోకిరి రోజులు గుర్తు వచ్చాయి. ఈ కథను ఒకే చేసినప్పుడు పరుశురామ్ గారు ఆయన ఇంటికి వెళ్లి థాంక్యూ సర్ అని ఒక మెసేజ్ పెట్టారు. థాంక్యూ సర్.. ఒక్కడు సినిమా చూసి బండెక్కి హైదరాబాద్ కు వచ్చాను డైరెక్టర్ అవుదామని.. మీరు ఈ అవకాశం ఇచ్చారు.

ఇప్పుడు చూడండి ఈ సినిమాను ఎలా తీస్తానో.. ఇరగదీసేస్తాను.. థాంక్యూ సర్ అని..  థాంక్యూ సర్ పరుశురామ్ గారు.. ఈరోజు నాన్నగారి అభిమానులు.. నా అభిమానులకు మీరు ఒక ఫెవరేట్  డైరెక్టర్ గా మారతారు. నిజంగా, మనస్ఫూర్తిగా సర్కారువారి పాట నాకు ఇచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్. సర్కారువారి పాట లో చాలా చాలా హైలైట్స్ ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ ట్రాక్.ఈ ట్రాక్ కోసమే రీపీట్ ఆడియెన్స్ ఉంటారు  నాకు తెలుసు ఖచ్చితంగా రాసుకోండి. కీర్తి సురేష్.. చాలా బాగా  చేసింది. ఆ అమ్మాయి పాత్ర కానీ, నటన కానీ చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. చాలా మంచి కో స్టార్..  లాస్ట్ ఏడాదిన్నర నుంచి మేము ఎన్ని డేట్స్ అడిగినా కాదనకుండా ఇచ్చేది. థాంక్యూ సో మచ్.. మా ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు.. అతని మ్యూజిక్ ఇవ్వాళ యూత్ కు కానీ, క్లాస్ కు కానీ, మాస్ కు కానీ కనెక్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇతనొక మ్యూజిక్ సెన్సేషన్.. నేను చాలా గర్వపడుతున్నాను అతని విజయానికి.. థమన్ కు నేను అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు పెద్ద ఫ్యాన్ ని.

నాకు తెలిసి ఇరగదీసేశాడు మన సినిమాలో..  థాంక్యూ వెరీ మచ్ థమన్.. నా బ్రదర్ లాండివాడివి .. ఇలాంటివి మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. మైండ్ బ్లాక్ సాంగ్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో అందరికి తెలుసు.. అంతకుమించి ఇంపాక్ట్ ఉంటుంది ఈ మహేశా సాంగ్. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి.. చాలా మారాయి. నాకు బాగా దగ్గరున్నవాళ్ళు దూరమయ్యారు. కానీ ఏది జరిగిన ఏది మారినా మీ అభిమానం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి. 12వ తేదీ మీకు నచ్చే సినిమా రాబోతోంది. మళ్లీ మన అందరికీ పండుగే. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.